నిద్రకు మూడు పోషకాలు
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర అంటారు.
ఈ రెండూ సమపాళ్లలో ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
కానీ మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు ప్రస్తుతం ఎంతో మందిని నిద్రకు దూరం చేస్తున్నాయి.
నిద్ర సరిగా పట్టకపోవటానికి ఒత్తిడి వంటి పలు అంశాలు దోహదం చేస్తాయి గానీ..
కొన్నిరకాల పోషకాలు లోపించినా నిద్రలేమికి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
• మెగ్నీషియం: ఇది నిద్రను నియంత్రించే ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం లోపం మూలంగా కనబడే లక్షణాల్లో నిద్ర పట్టకపోవటమూ ఒకటి. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు మెగ్నీషి యం దండిగా ఉండే పదార్థాలు తినటం మేలు. ఆకు కూరలు, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, బీన్స్, కొన్నిరకాల చేపల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.
పొటాషియం: నాడులను, కండరాలను నియంత్రించే ఈ పోషక లోపంతో నిద్ర పట్టటంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అరటి పండులో పొటాషియం చాలా ఎక్కువగా (రోజుకు అవసరమైన మోతాదులో 10 శాతం) పొట్టుతీయని ధాన్యాలు, బీన్స్, ఆకుకూర లు, ఉడికించిన ఆలుగడ్డలతోనూ ఇది బాగా లభిస్తుంది.
• విటమిన్ డి: ఎదుగుదలకు, ఎముకల దృఢత్వానికి దోహదం చేసే విటమిన్ డి లోపం మూలంగా నిస్సత్తు, పగటిపూట మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో రాత్రిపూట కునుకుపట్టటం కష్టమవు తుంది. రోజూ కాసేపు ఎండలో నిలబడితే మన శరీరమే దీన్ని తయారు చేసుకుంటుంది. కానీ ప్రస్తుతం హడావుడి జీవితంలో చాలామంది దీన్ని పట్టించుకోవటం లేదు. సాల్మన్, సార్డైన్, టూనా వంటి చేపలు.. గుడ్డు పచ్చసొనతో కొంతవరకు విటమిన్ డి అందుతుంది.
No comments:
Post a Comment