Translate

Saturday, December 31, 2022

మన ఆరోగ్యం

 విటమిన్ బి 12

ఇది చాలా ముఖ్యమైన విటమిన్ ఈ విటమిన్ లోపిస్తే నరాల బలహీనత జుట్టు ఊడటం మత్తుగా ఉండడం అనేక సమస్యలు వస్తాయి


అయితే ఇంతకాలం ఈ విటమిన్ బి12 అనేది శాఖాహారంలో ఉండదు కేవలం మాంసాహారంలో మాత్రమే ఉంటుంది అని మాంసాహారం ఎక్కువగా తీసుకునేవారు అయితే మాంసాహారంలో బి12 ఉన్నప్పటికీ మాంసాహారం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ శాఖాహారంలో బి12 ఉండకపోవడం వలన మాంసాహారం మీద ఆధారపడేవారు

అయితే నిజానికి బి 12 అనేది శాఖాహారంలో లేనప్పటికీ ప్రతి శాఖా హరి జీవిలో మనం ప్రేగులోనే బి12 అనేది ఉత్పత్తి అవుతుంది కానీ ఇటీవల కాలంలో అందరూ మనబద్ధకంతో మలవిసర్జన చేయకపోవడం వలన మనం ప్రేగులో అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న ఉత్పత్తి అవడం లేదు అందుకే బి12 సమస్య శాఖాహారులు ఎక్కువగా ఉంటుంది

అయితే ఇటీవల జూన్ గుజరాత్ వారు పరిశోధించిన ప్రయోగశాలలో ఒక కొత్త విషయం కనుగొన్నారు

విటమిన్ బి12 అనేది శాఖాహారంలో రెండు రకాలుగా దొరుకుతుంది ఒకటి పుట్టగొడుగుల్లో బి12 ఉంటుంది

రెండు మామిడికాయ టెంకలో ఉండే జీడి ఈ జీడిని ఎండకి ఎండ పెట్టి పౌడర్ గా చేసుకొని కూరల్లో గాని తేనె నిమ్మరసంలో గాని వాడుకుంటే బి12 పుష్కలంగా అందుతుంది

నిజానికి ఒక మనిషికి రోజుకి 2.4 మైక్రోగ్రామ్ అవసరం కానీ మామిడి టెంక జిడిలో 100 గ్రాములు 120 మైక్రోగ్రామ్స్ ఉంటుంది

పుట్టగొడుగుల్లో 100 గ్రాములు 3.5 ఉంటుంది అంతేకాకుండా కాల్షియం 111 మిల్లీగ్రామ్స్
ఫైబర్ 2 గ్రామ్స్ ఐరన్ 12 మిల్లీగ్రామ్స్ ఉంటుంది

Friday, December 2, 2022

మన ఆరోగ్యం

 (మన ఆరోగ్యంలో బెల్లం వల్ల లాభాలు) $  $

1. నెయ్యి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్న చోట వేస్తె భాధ నివారణ అవుతుంది.

2. ముక్కు కారడముతో బాధపడుతున్న వారికి ... పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది.

3. బెల్లం, నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5-6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది.

4. బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది.

5. భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. 

6. లివర్ను శుభ్ర పరిచేందుకు బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది.

7. బెల్లంను తింటే లివర్లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

8. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తాయి.

 9. ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.





Friday, November 11, 2022

మన ఆరోగ్యం

 


నిద్రకు మూడు పోషకాలు

కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర అంటారు. 

ఈ రెండూ సమపాళ్లలో ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. 

కానీ మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్లు ప్రస్తుతం ఎంతో మందిని నిద్రకు దూరం చేస్తున్నాయి. 

నిద్ర సరిగా పట్టకపోవటానికి ఒత్తిడి వంటి పలు అంశాలు దోహదం చేస్తాయి గానీ..

కొన్నిరకాల పోషకాలు లోపించినా నిద్రలేమికి దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


మెగ్నీషియం: ఇది నిద్రను నియంత్రించే ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం లోపం మూలంగా కనబడే లక్షణాల్లో నిద్ర పట్టకపోవటమూ ఒకటి. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు మెగ్నీషి యం దండిగా ఉండే పదార్థాలు తినటం మేలు. ఆకు కూరలు, గుమ్మడి విత్తనాలు, నువ్వులు, బీన్స్, కొన్నిరకాల చేపల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.


పొటాషియం: నాడులను, కండరాలను నియంత్రించే ఈ పోషక లోపంతో నిద్ర పట్టటంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అరటి పండులో పొటాషియం చాలా ఎక్కువగా (రోజుకు అవసరమైన మోతాదులో 10 శాతం) పొట్టుతీయని ధాన్యాలు,  బీన్స్, ఆకుకూర లు, ఉడికించిన ఆలుగడ్డలతోనూ ఇది బాగా లభిస్తుంది.


విటమిన్ డి: ఎదుగుదలకు, ఎముకల దృఢత్వానికి దోహదం చేసే విటమిన్ డి లోపం మూలంగా నిస్సత్తు, పగటిపూట మగత వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో రాత్రిపూట కునుకుపట్టటం కష్టమవు తుంది. రోజూ కాసేపు ఎండలో నిలబడితే మన శరీరమే దీన్ని తయారు చేసుకుంటుంది. కానీ ప్రస్తుతం హడావుడి జీవితంలో చాలామంది దీన్ని పట్టించుకోవటం లేదు. సాల్మన్, సార్డైన్, టూనా వంటి చేపలు.. గుడ్డు పచ్చసొనతో కొంతవరకు విటమిన్ డి అందుతుంది.


Wednesday, November 9, 2022

ఆధ్యాత్మిక

 

💞 *~ప్రవహించుచున్ననదిలో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచూ ఫండును. ఇదేవిధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు? ఓ మానవుడా సావధానుడవై ఉండుము.*

❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్~*

Friday, October 28, 2022

Health Tips

 


దగ్గు తగ్గాలంటే?


ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా అల్లం రసం, నిమ్మరసం కలుపుకుని తాగాలి


ఒక పాత్రలో నీటిని తీసుకుని, అందులో కొన్ని పుదీనా ఆకులను వేసి మరిగించి, ఆ తర్వాత వచ్చే మిశ్రమాన్ని తాగాలి


లవంగాలు, దాల్చినచెక్క, అల్లం రసం, మిరియాలు కలిపి తయారు చేసిన మసాలా టీ తాగాలి


హెర్బల్ టీలో తేనె కలుపుకుని తాగాలి


… ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.



Tuesday, October 18, 2022

మన ఆరోగ్యం

  విటమిన్ బి 12 ఇది చాలా ముఖ్యమైన విటమిన్ ఈ విటమిన్ లోపిస్తే నరాల బలహీనత జుట్టు ఊడటం మత్తుగా ఉండడం అనేక సమస్యలు వస్తాయి అయితే ఇంతకాలం ఈ విట...